Hyderabad, మార్చి 31 -- RGV on Police: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనానికి మారుపేరు. అతని సినిమాలైనా, ట్వీట్లు అయినా, మాటలైనా అంతే. తాజాగా తన విషయంలో జరిగిన ఓ ఆసక్తికర పరిణామం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు ఎలా తనతో మందు కొట్టి వెళ్లిపోయారో అతడు వెల్లడించాడు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య గేమ్ ఛేంజర్స్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తాను కొన్నాళ్ల కిందట చేసిన ట్వీట్లు తనను ఎలా ఇబ్బందుల్లో పడేశాయో వివరించాడు. ఆ ట్వీట్లను తాను పెద్దగా ఆలోచించకుండానే పోస్ట్ చేశానని, డైరెక్టర్ మహేష్ భట్ తనకు ఫోన్ చేసే వరకు కూడా అసలు తాను ఏం పోస్ట్ చేశానో కూడా తనకు తెలియదని అతడు చెప్పాడు.

"నాలుగైదేళ్ల కిందట నేను కొన్ని పోస్టులు ట్వీట్ చేశాను. నాకు ఏమనిపిస్తే అది రాశాను. పెద్దగా ఆలోచించలేదు. క...