Hyderabad, ఫిబ్రవరి 2 -- Actor Govind Namdev About Ram Gopal Varma Movies: ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య, సర్కార్ రాజ్ వంటి చిత్రాల్లో నటించిన యాక్టర్ గోవింద్ నామ్ దేవ్. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

హిందీ రష్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యాక్టర్ గోవింద్ నామ్ దేవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో తెరకెక్కించిన సినిమాల గురించి, ఆయన క్రియేటివిటీ గురించి కామెంట్స్ చేశారు. యాంకర్ ఆర్జీవీ గురించి, రీసెంట్‌గా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలపై అభిప్రాయం చెప్పమని ప్రశ్నించారు.

ఒక స్థాయికి చేరుకున్నాక దర్శకుడు మారిపోయాడని గోవింద్ నామ్ దేవ్ అన్నారు. "ఎవరైనా ఒక స్థాయికి (కీర్తి) చేరుకున్న తర్వాత, అది వారి మనస్సును మారుస్తుంది. అతనికి (రామ్ గోపాల్ వర్మ) కూడ...