Hyderabad, మార్చి 21 -- Ram Gopal Varma On Posani Arrest Betting Apps Saaree Movie Release: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. శారీ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.

ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ శారీ సినిమాను నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా మార్చి 20న హైదరాబాద్‌లో శారీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "మనం ఎవరితోనైనా డైరెక్ట్‌గా మాట్లాడినప్పుడు పెద్దగా వార...