Hyderabad, మార్చి 10 -- Ram Gopal Varma On Pawan Kalyan Sandeep Reddy Vanga: విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ 'శారీ'. 'టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ' అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు గిరి కృష్ణకమల్‌ దర్శకత్వం వహించారు.

ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌ వర్మ శారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన 'శారీ' మూవీని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

శారీ సినిమాను పలు యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన శారీ చిత్రంపై ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్...