Ramagundam,telangana, ఏప్రిల్ 9 -- రామగుండం ఫెర్టిలైజన్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా. ఏప్రిల్ 10వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది.

ఈ ఖాళీలు తెలంగాణలోని రామగుండం కేంద్రంతో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో ఉన్నాయి. ఎంపికైన వారు. ఇక్కడ పని చేయాల్సి ఉంటుంది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, మెటీరియల్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, సివిల్, మెడికల్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కెమికల్, మెకాన...