భారతదేశం, ఫిబ్రవరి 26 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. రివోల్ట్ మోటర్స్ కూడా.. అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శక్తివంతమైన 4 kW మోటార్, 150 కి.మీ సింగిల్ ఛార్జ్ రేంజ్, 85 కి.మీ గరిష్ట వేగం, స్మార్ట్ కనెక్టివిటీ వంటి లక్షణాలతో వస్తుంది.

రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ ధర రూ.1,14,990(ఎక్స్-షోరూమ్). ఈ కమ్యూటర్ బైక్ కోసం బుకింగ్‌లు ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమయ్యాయి. డెలివరీలు మార్చి 2025 మొదటి వారం నుండి ఉంటాయి. రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ వంటి రెండు అద్భుతమైన రంగు ఆప్షన్స్‌తో వస్తుంది. రివోల్ట్ మోటార్స్ హర్యానాలోని మనేసర్‌లోని దాని అత్యాధునిక ప్లాంట్‌లో ఆర్వీ బ్లేజ్ ఎక్స్‌ను తయారు చేస్తుం...