భారతదేశం, ఫిబ్రవరి 25 -- Revenge Thriller OTT: ఓ రివేంజ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు త‌మిళ హీరో విమ‌ల్‌. ఈ వెబ్‌సిరీస్‌కు ఓం కాళీ జై కాళీ అనే టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది. జియో హాట్ స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్‌ను జియో హాట్ స్టార్ ఇటీవ‌ల రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఉగ్ర రూపంలో ఉన్న కాళీమాత క‌నిపిస్తోంది. విమ‌ల్‌తో పాటు మ‌రో న‌లుగురు యాక్ట‌ర్స్‌ను పోస్ట‌ర్‌లో డిఫ‌రెంట్ లుక్‌ల‌లో క‌నిపిస్తున్నారు.

ఓ కాళీ జై కాళీ వెబ్‌సిరీస్‌ను త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు జియోహాట్‌స్టార్ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఓం కాళీ జై కాళీ వెబ్‌సిరీస్‌లో తెలుగు యాక్ట‌ర్ పావ‌ని రెడ్డి క...