భారతదేశం, ఫిబ్రవరి 28 -- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి చేసిన అంశాలను లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదని.. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్‌-2కు రూ.24,269 కోట్లు, ఆర్ఆర్ఆర్ కోసం రూ.34,367 కోట్లు, మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు కోరినా ఇవ్వలేదని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్‌ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

ఇటీవల ప్రధానిని కలిసిన రేవ...