భారతదేశం, ఏప్రిల్ 4 -- భద్రాచలం రాములోరి భక్తులకు.. కష్టాలు తప్పటం లేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో తరలివచ్చే లక్షలాది మంది భక్తులు.. కనీస వసతులకు నోచుకోవడం లేదు. వసతులలేమి తీవ్ర సమస్యగా మారుతోంది. శ్రీరామనవమి వంటి ఉత్సవాల సమయంలో.. భక్తులు కనీసం తలదాచుకొనేందుకు చోటు ఉండటం లేదు. కష్టాలు పడుతూనే సీతారాముల కల్యాణాన్ని తిలకిస్తున్నారు.

కుతుబ్‌షాహీల కాలంలో కంచర్ల గోపన్న భద్రగిరిపై ఆలయం ప్రధాన గోపురాన్ని నిర్మించారు. దానికి కొద్దిపాటి మార్పులు తప్ప.. పూర్తిస్థాయిలో దేవస్థానాన్ని ఇంతవరకూ ఆధునీకరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. యాదగిరిగుట్ట ఆలయంతో పాటు భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. అర్కిటెక్ట్‌ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌‌ను సిద్ధం...