భారతదేశం, మార్చి 22 -- నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై అంద‌రిని ఏక‌తాటిపై తెచ్చిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు.. పున‌ర్విభ‌జ‌న‌పై అభిప్రాయాలను పంచుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆయన అభిప్రాయాల‌ను మిగతా నాయకులతో పంచుకుంటున్నారు. 1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి.. ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే.. ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫ‌ల‌మ‌య్యాయని సీఎం రేవంత్ వివరించారు.

1.ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయి. దేశ ఖ‌జానాకు మ‌...