భారతదేశం, జనవరి 26 -- ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలో ప్రారంభిస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు.. కొడంగల్ నియోజకవర్గానికి జరగాల్సిన న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే.. సోనియా గాంధీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు.

'ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్‌కు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్న. భూమికి, విత్తుకు ఎంత అనుబంధమో.. కాంగ్రెస్‌కు రైతులకు అంత అనుబంధం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు.. బకాయిలను రద్దు చేశారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశ వ్యాప్తంగా రూ.72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశా...