Hyderabad, ఏప్రిల్ 18 -- Retro Trailer: సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా రెట్రో (Retro). ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే సుమారు రెండు వారాల ముందుగానే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 18) చెన్నైలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు.

పిజ్జా అనే హారర్ మూవీతో వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెలుసు కదా. అతని డైరెక్షన్ లో తాజాగా వస్తున్న మూవీ రెట్రో. తమిళ స్టార్ హీరో సూర్య నటించాడు. పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఈ మూవీ మే 1న రిలీజ్ కానుండగా.. ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులోనూ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు ట్రైలర్ ను కూడా తెలుగులో తీసుకొచ్చారు.

రెట్రో లుక్ లో సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది....