భారతదేశం, ఏప్రిల్ 22 -- జీవితంలో సగం వయసుకంటే ఎక్కువగా ఉద్యోగంలోనే గడుపుదాం. ఆఫీసు అనేది మరో కుటుంబంలాంటిది. ఇంట్లోవారికంటే అక్కడే ఎక్కువగా ఉంటాం. తర్వాత ఉద్యోగ విరమణ చేస్తాం. అనంతరం చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. డబ్బులను సరైన క్రమంలో ఉపయోగించుకోకపోవడం. ఈ సమస్యతోనే అనేక మంది కుంగిపోతారు. ఉద్యోగం చేసిన సమయంలో డబ్బు విషయంలో ఉన్నంత ఫ్రీగా విరమణ తర్వాత ఉండదు.

అధికారిక బాధ్యతల కోసం మీ జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆఫీసులోనే గడుపుతారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాక ఎవరిపైనా ఆధారపడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటారు. కానీ భారతదేశంలోని చాలా మంది ప్రజలు పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 70 శాతం మంది ప్రజలు వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. మీరు ఈ పరిస్థిత...