Hyderabad, జనవరి 26 -- భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం జనవరి 26న వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. జనవరి 26 వచ్చిందంటే ప్రతిచోటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. 1950లో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజును స్మరించుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటాము. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిచిన రోజు.

భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి 75 ఏళ్ళు పూర్తయింది. ఈ సంవత్సరం మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మీరు మీ ప్రియమైన వారికి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో రిపబ్లిక డే విషెస్ పంపాలనుకుంటే ఇక్కడ చూడండి. వీటిలో అందమైన శుభాక...