Hyderabad, జనవరి 23 -- దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో రిపబ్లిక్ డే స్పీచ్ కూడా ఒకటి. పాఠశాలలో ఉపన్యాసం ఇవ్వాలనుకునే పిల్లల కోసం చిన్న ప్రసంగాలు ఇక్కడ ఇచ్చాము. ఇవి చాలా సులువుగా ఉంటాయి. మీ పిల్లల చేత వీటిని ప్రిపేర్ చేయించండి.

ఈ రోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. అందుకే దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాము. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 ఎంత ముఖ్యమో, మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా అంటే ముఖ్యం. ఈ రోజు గురించి మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

మిత్రులారా, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద దేశం భారతదేశం. ప్రపంచంలో...