భారతదేశం, జనవరి 26 -- భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ, దేశ రాజధానిలోని కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే, జాతీయ గీతాలాపన జరుగుతుండగా.. గాలిలోకి తూటాలు పేల్చుతూ భారత సైన్యం సమర్పించిన '21 తుపాకుల గౌరవ వందనం' అక్కడి వాతావరణాన్ని దేశభక్తితో నింపేసింది.

ఈ రిపబ్లిక్​ డే పరేడ్​లో ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్​ మంత్రులు, అనేక మంది ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు.

యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్​ శాంటోస్​ డా కోస్టా, యూరోపియన్​ కమిషన్​ ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డెర్​ లేయన్​ తదితరులు నేటి గణతంత్ర దినోత్స వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గ్రూప్​ కెప్టెన్​, ఇస్రో ప్రతిష్ఠాత్మక...