భారతదేశం, జనవరి 20 -- జనవరి 26 రాబోతుందంటే చాలు దేశమంతా దేశభక్తి భావం ఉప్పొంగుతుంది. అయితే ప్రతి ఏటా చాలా మందిలో ఒక సందేహం తలెత్తుతుంటుంది. అదే.. "ఈ ఏడాది మనం జరుపుకునేది ఎన్నవ రిపబ్లిక్ డే?" అని. 2026 విషయానికి వస్తే, భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతోంది.

చాలా మంది 1950 నుండి 2026 వరకు ఉన్న తేడాను లెక్కించి (2026 - 1950 = 76) ఇది 76వ వార్షికోత్సవం కాబట్టి, 77వ రిపబ్లిక్ డే అని భావిస్తుంటారు. మరికొందరు 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుండి లెక్కించి పొరబడుతుంటారు.

మొదటి రిపబ్లిక్ డే: జనవరి 26, 1950 (రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు).

రెండవ రిపబ్లిక్ డే: జనవరి 26, 1951. ఈ క్రమంలో లెక్కిస్తే.. జనవరి 26, 2026 నాడు జరిగేది 77వ రిపబ్లిక్ డే వేడుక. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యి, 77వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ...