భారతదేశం, జనవరి 27 -- తూర్పు గోదావరి జిల్లాకు సమీపంలో ఉన్న యానాంలో.. ప్ర‌జ‌లు 71వ గ‌ణ‌తంత్ర వేడుకలు జ‌రుపుకున్నారు. ఇదో ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో పోరాటాల‌తో 1947లో దేశానికి స్వ‌తంత్రం వస్తే.. ఫ్రెంచ్‌ ప్ర‌భుత్వం పాల‌న‌లో ఉన్న యానాంకు 1954 న‌వంబ‌ర్ 1న స్వాతంత్రం వచ్చింది. అప్ప‌టి ఫ్రెంచ్ క‌మిష‌న‌ర్ ఎస్క‌రుయిల్.. ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలైన యానాంతో పాటు పుదుచ్చేరి, కారైకాల్‌, మాహేల‌కు త‌గిన ప్రాధాన్యం, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు.

అప్ప‌టి దేశ‌ ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూతో ఒడంబ‌డిక కుదుర్చుకుని.. దేశం నుంచి వెళ్లిపోయారు. 1956లో ఈ తాత్కాలిక ఒప్పందం జ‌రిగింది. త‌రువాత యానాంను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. యానాంలో అంద‌రూ తెలుగులో మాట్లాడిన‌ప్ప‌టికీ, ఏపీ ప్ర‌భుత్వం పాలించ‌టం లేదు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో అంత‌ర్భగంగా ఉం...