Hyderabad, ఏప్రిల్ 9 -- Renu Desai on Second Marriage: పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి, తర్వాత విడాకుల ఎపిసోడ్ తెలుగునాట ఓ సంచలనం. వీళ్లు విడిపోయిన తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకున్నా.. రేణు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే తాను తన పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వెల్లడించింది.

రేణు దేశాయ్ తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను ఒంటరిగానే ఉండటానికి, 2018లో నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి కారణమేంటో తెలిపింది. పవన్ తో విడిపోయిన తర్వాత తనకెప్పుడైనా మళ్లీ ఓ పార్ట్‌నర్ కావాలని అనిపించిందా అన్న ప్రశ్నకు రేణు ఇలా స్పందించింది.

"నిజమే. నాకూ ఓ పార్ట్‌నర్ కావాలని అనిపించింది. కానీ నా పిల్లలపై నాకున్న బాధ్యత ఆ దిశగా నేను ఆలోచించకుండా చేసింది. వ్యక...