భారతదేశం, మార్చి 11 -- రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెనాల్ట్ ఇటీవల ఖైగర్ లైనప్​ను కొత్త ఫీచర్లు, వేరియంట్ కలయికతో అప్డేట్​ చేసింది. ఇక ఫుల్​ లెన్త్​ ఫేస్​లిఫ్ట్ వర్షెన్​ 2025 రెండో భాగంలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ ప్రస్తుత ఖైగర్ మాదిరిగానే సిల్హౌట్​ను నిలుపుకుంటుందని తెలుస్తోంది. అయితే, ఖైగర్ ఫేస్​లిఫ్ట్​లో సన్నని, సమాంతరంగా అలైన్ చేసిన ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, రెస్టిల్డ్ రేడియేటర్ గ్రిల్, పునర్నిర్మించిన ఫ్రంట్ బంపర్ ఉంటాయి. షార్క్​ఫిన్ యాంటెనాను జోడిస్తుందని అంచనాలు ఉన్నాయి.

కొత్త 16 ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్లియర్-లెన్స్ ఎల్​ఈడీ టెయిల్ లైట్లు, రీవర్క్ చేసిన బంపర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఎక్స్​టీరియర్​ వంటివి ఇతర ముఖ్య హైలైట్స్. వీటితో పాటు ఫేస్​లిఫ్టెడ్ ఖైగర్​ల...