భారతదేశం, ఫిబ్రవరి 24 -- కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన వినియోగదారులకు గొప్ప వార్తను అందించింది. కంపెనీ తన ప్రసిద్ధ కారులైన క్విడ్, ట్రైబర్, కిగర్ కోసం ప్రభుత్వం ఆమోదించిన సీఎన్జీ కిట్‌లను ప్రారంభించింది. దీనితో ఈ కార్లు ఇప్పుడు మరింత తక్కువ నిర్వహణ ఖర్చుతోపాటుగా పర్యావరణ అనుకూలమైన ఎంపికగా మారతాయి. కంపెనీ ఇటీవల ఈ కార్లను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. రెనాల్ట్ సీఎన్జీ కిట్ ధర వివరాలను తెలుసుకుందాం..

ప్రభుత్వం ఆమోదించిన సీఎన్జీ కిట్‌ను రెనాల్ట్ రెట్రోఫిట్ పద్ధతి ద్వారా ఇన్‌స్టాల్ చేస్తారు. దీని అర్థం ఇది ఫ్యాక్టరీలో అమర్చరు. కానీ వినియోగదారుల కోసం విడిగా ఇన్‌స్టాల్ చేస్తారు. రెనాల్ట్ క్విడ్ సీఎన్జీ కిట్ ధర-రూ.75,000, రెనాల్ట్ కారిగర్, ట్రైబర్ సీఎన్జీ కిట్ ధర - రూ. 79,500గా ఉంటుంది. కంపెనీ ప్రకారం ఈ సీఎన్జీ కిట్ వాహనం పనితీరుపై ప్రభావం చూ...