భారతదేశం, ఏప్రిల్ 12 -- బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ గదర్ 2 సినిమా అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది. 2023 ఆగస్టులో విడుదలైన ఈ సీక్వెల్ పీరియడ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఏకంగా రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సూపర్ హిట్ తర్వాత తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జాట్' సినిమా చేశారు సన్నీ. ఈ చిత్రం ఈ వారమే ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. కాగా, జాట్ మూవీకి సన్నీ డియోల్ తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు బయటికి వచ్చాయి.

జాట్ చిత్రం కోసం సన్నీ డియోల్ రూ.50కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. గదర్ 2 చిత్రానికి ఆయన దాదాపు రూ.8 కోట్లు పుచ్చుకున్నారు. ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో ఆ చిత్రంతో పోలిస్తే పోలిస్తే జాట్ మూవీకి సుమారు ఆరు రెట్లు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నారు సన్నీ డి...