Hyderabad, మార్చి 20 -- Tammareddy Bharadwaja On O Andala Rakshasi Remuneration: దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు 'ఓ అందాల రాక్షసి' అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు.

ఓ అందాల రాక్షసి మూవీలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో 'ఓ అందాల రాక్షసి' చిత్రం రానుంది. మార్చి 21న ఈ ఓ అందాల రాక్షసి చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇటీవల మంగళవారం (మార్చి 18) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడ...