భారతదేశం, జనవరి 6 -- దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​) షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. క్రితం సెషన్‌లో దాదాపు 1 శాతం నష్టపోయిన రిలయన్స్​.. నేటి ఉదయం ట్రేడింగ్‌లో, ఒకానొక దశలో ఏకంగా 4 శాతం వరకు పతనమైంది. దీనికి కారణం ఏంటి? ఈ కరెక్షన్​లో రిలయన్స్​ని కొనొచ్చా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు? ఇక్కడ తెలుసుకోండి..

మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ షేర్లపై గత రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో క్రితం ముగింపు రూ. 1,577.45 తో పోలిస్తే, నేడు రూ. 1,575.55 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన రిలయన్స్.. ఒక దశలో రూ. 1,517.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఇక ఉదయం 11 గంటల సమయంలో రిలయన్స్​ షేరు ధర 3.6శాతం పతనమై రూ. 1522 వద్ద కొనసాగుతోంది.

ప్రపంచంలోనే అత్యధ...