భారతదేశం, ఫిబ్రవరి 28 -- Reliance Disney Merger: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, దిగ్గజ మీడియా సంస్థ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనానికి నేడు (ఫిబ్రవరి 28) ఒప్పందం జరిగింది. దేశ ఎంటర్‌టైన్‍మెంట్ రంగంలోనే ఇది అతిపెద్ద విలీనంగా ఉంది. ఇందులో భాగంగా రిలయన్స్‌కు చెందిన వియాకామ్ 18, స్టార్ ఇండియా టీవీ ఛానెళ్లు విలీనం కానున్నాయి. ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు జియోసినిమా, హాట్‍స్టార్ కూడా జాయింట్ వెంచర్‌లోనే ఉండనున్నాయి.

రిలయన్స్, డిస్నీ ఇండియా జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంది. జాయింట్ వెంచర్ అభివృద్ధి కోసం రూ.11,500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది. ఈ జాయింట్ వెంచర్ పూర్తయ్యాక రిలయన్స్ దీన్ని నియంత్రించనుంది. ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్‌కు 16.34 శాతం, రిలయన్స్ ...