భారతదేశం, ఆగస్టు 29 -- స్టాక్​ మార్కెట్​ ఎక్స్​పర్ట్స్​, మదుపర్లు, ఫైనాన్షియల్​ వ్యవస్థలు ఎంతగానో ఎదురుచూస్తున్న రిలయన్స్​ జియో ఐపీఓపై బిగ్​ అప్డేట్​! 2026 ప్రథమార్థంలో జియో ఐపీఓ రానుంది. ఈ విషయాన్ని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత, బిలియనీర్​ ముకేశ్​ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో మాట్లాడుతూ.. "జియో తన ఐపీఓ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని ప్రకటించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది," అని ముకేశ్ అంబానీ తెలిపారు.

"అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత.. 2026 ప్రథమార్ధంలో జియోను లిస్ట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. జియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల మాదిరిగానే మంచి విలువను సృష్టించగలదని ఇది నిరూపిస్తుంది. ఇది పెట్టుబడిదారులందరికీ చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెబుతు...