భారతదేశం, జనవరి 29 -- వీకెండ్ వచ్చిందంటే ఎవరికైనా కలిగే భావన రిలాక్సేషన్. వారం అంతా వివిధ రకాల పని ఒత్తిళ్లు, ఆఫీస్ చికాకులు అనుభవించిన తర్వాత, వారాంతంలో వచ్చిన సెలవు రోజున ఆ చికాకులన్నీ పక్కనపెట్టి హాయిగా కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. అయినప్పటికీ వారాంతంలో కూడా ఇంటి పనులు, సొంత పనులతో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది, మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. మీరు ఈ ఒత్తిడి నుంచి బయటడి, హాయిగా విశ్రాంతి పొందాలంటే కొన్ని రకాల రిలాక్సేషన్ పద్ధతులు ఉపయోగపడతాయి. విశ్రాంతి అనేది మన మనశ్శాంతిని మనమే ఆస్వాదించడం. దైనందిన జీవితంలో ప్రతీ వ్యక్తికి విశ్రాంతి అనేది అవసరం. ఇది మీ మనస్సు, శరీరంపై ఒత్తిడి ప్రభావాలను తగ్గించే ప్రక్రియ. రిలాక్సేషన్ టెక్నిక్‌లు ఒత్తిడి నిర్వహణలో సహాయపడే గొప్ప మార్గం. ఈ పద్ధతులు గుండె జబ్బులు, గుండె నొప్పి, గాయం వంటి వివిధ దీ...