Hyderabad, ఫిబ్రవరి 12 -- భార్యాభర్తల అనుబంధం చాలా ప్రత్యేకం. ఇద్దరూ ఒకరినొకరు తోడుగా నిలవాలి. ఆటుపోట్లు, సుఖదుఃఖాలు, గెలపోటముల్లో కలిసి నిలబడతామని ఇద్దరూ వాగ్దానం చేసుకోవాలి. ఒక మంచి జీవిత భాగస్వామి దొరకడం నిజంగా ఎంతో లక్కీ. అదే అర్థం చేసుకోని జీవిత భాగస్వామి దొరికితే మాత్రం జీవితంపై విరక్తిని కలిగిస్తుంది. చాలా సార్లు చిన్న చిన్న విషయాల వల్ల రిలేషన్ షిప్ లో దూరాలు పెరిగిపోయి, బంధం ముగింపు దశకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అభినందించుకోకపోవడం, గౌరవించకపోవడం మొదలవుతుంది. ఇది రెండు వైపుల నుండి జరగవచ్చు. కానీ భార్యకు ఇలాంటి అలవాటు ఉంటే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలుసుకోండి.

ఏ బంధంలోనైనా విభేదాలు సృష్టించడానికి అనుమానం పనిచేస్తుంది. ఈ విషయంలో భార్య తన భర్తను అనుమానించడం ప్రారంభించినప్పుడు, అది వారి సంబంధానికి మంచి సంకేతం కాదు. ఇది సంబ...