Hyderabad, ఫిబ్రవరి 9 -- ప్రేమికులైనా, భార్యాభర్తలైనా, జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే, కొన్ని రకాల బిహేవియర్లను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ రిలేషన్‌ను నిలబెట్టడమే కాదు, బలంగానూ, సంతృప్తికరంగానూ ఉంచుతుంది. ప్రతి రిలేషన్‌లో కచ్చితంగా ఉండే ప్రేమ, నమ్మకం అనేవి గొడవ జరిగిన తర్వాత మళ్లీ మిమ్మల్ని కలిపేవి అవే. కానీ, ఆ ఆవేశంలో కొన్ని పనులు చేస్తే మాత్రం జీవితాంతం రిగ్రెట్ ఫీలవుతారని నిపుణులు చెబుతున్నారు. ఆ సలహాలేంటో తెలుసుకుందామా..

మీరు గొడవ సమయంలో మీ మీద నియంత్రణ కోల్పోయి, అవమానకరమైన మాటలు అంటుంటారు. అయితే వాటి గురించి పరస్పరం చర్చించుకుంటేనే ఆవేశం తగ్గుతుంది. అలా కాకుండా మీరొక్కరే రియలైజ్ అయి నిద్రపోకండి. ఇద్దరూ గొడవను మరిచిపోయి నిద్రించడం అనేది ఉత్తమ మార్గం. ఇలా జరగడం వల్ల మీ సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీసే పరిణామాలు రాకుండా ఉంటాయి. ...