Hyderabad, మార్చి 29 -- భార్యాభర్తల సంబంధం మిగతా అన్ని సంబంధాలకన్నా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమ బంధంతో ఒక్కటై జీవితాతం కలిపి ప్రమాణం చేస్తారు. ఈ అందమైన సంబంధంలో ప్రేమ, గొడవలు, అలకలు సహజం. జీవితంలోని ప్రతి మలుపులోనూ కలిసి నడిచేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పకుండా వస్తాయి. అయితే ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచకుండా ఉండాలంటే.. వారి సంబంధ గౌరవాన్ని కాపాడుకోవడానికి, కొన్ని విషయాలను వారు వారిద్దరి మధ్యనే ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఇతరుల ముందు బయట పెట్టకూడదు.

ఆలూమగల మధ్యలోకి మూడో వ్యక్తిని తీసుకురావడం వల్ల, వారు మంచిగా ఆలోచించిన విషయాలు కూడా, చిన్న చిన్న విషయాలు కూడా అనవసరంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులతో కూడా పంచుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా రండ...