Hyderabad, ఫిబ్రవరి 8 -- ప్రేమలో పడటం సులభం, ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడమూ సులభమే. కానీ, ప్రేమను కాపాడుకోవడం కష్టం. అదే బ్రేకప్ అయ్యాక తట్టుకోవడమూ కష్టమే. మీరు లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు గతం నుంచి బయటకు రావాలని బ్రేకప్ చెప్పేసి ఉంటారు. కానీ, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటే, మానసికంగా చాలా నష్టపోతారు. కొత్త జీవితం మొదలుపెట్టాలంటే, ముందుగా అందులో నుంచి బయటకు రావాలి. మీ జీవితాన్ని నరకంగా మార్చేసే గురుతుల నుంచి కొత్త దారి వెతుక్కోవాలి. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటపడిన తర్వాత, దాని నుండి కోలుకోవడానికి కొద్దిగా కష్టపడాలి.ప్రేమను ఖచ్చితంగా కాపాడుకోవడానికి చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం.

విషపూరిత సంబంధం మిమ్మల్ని నిరాశలోకి నెట్టేయెచ్చు. గందరగోళానికి గురిచేయవచ్చు. ప్రపంచమే మునిగిపోయినట్లుగా కూడా అనిపించవచ్చు. అదెంతలా అంటే, మన జీవి...