భారతదేశం, ఫిబ్రవరి 18 -- Registrations DIG: ఉన్నత ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వ అధికారి వివాహేతర సంబంధంతో భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. ఆమెను చితకబాదడంతో గాయాలపాలైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నెల్లూరులో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ డీఐజీగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించి వెళ్లి చేసుకున్న భార్యను దారుణ హింసలకు గురి చేసిన ఘటనలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారిపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త తనను చితకబాదాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సోమవారం రాత్రి గుంటూరు అరండల్‌పేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్‌ కుమార్‌ ప్రస్తుతం సెలవులో ఉన్నార. ఎల్‌ఐసిలో ఆసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయరాణిని కొన్నేళ్ల...