Hyderabad, ఫిబ్రవరి 17 -- చిన్నారుల్లో టెలివిజన్, మొబైల్ ఫోన్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వారి ప్రవర్తనల్లో అనేక మార్పులు తీసుకురావొచ్చు. చాలా అధ్యయనాల్లో పేర్కొన్న దానిని బట్టి టీవీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటుపడిన పిల్లల్లో సహనం చాలా తక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా వారిలో ఆందోళన, ఒత్తిడి అనే భావాలు కూడా ఎక్కువగా కలుగుతుంటాయట. వీటికి అలవాటుపడిన పిల్లలు అందులో నుంచి బయటపడటం కూడా చాలా కష్టంగా మారిపోతుందట. స్కూల్స్ టీచర్లు, డాక్టర్లు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పి స్క్రీన్ టైం తగ్గించమని చెప్పినా అదే అలవాటును కొనసాగిస్తుంటాం.

కానీ, ఓ మహిళ ఈ పని చేసింది టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచి పిల్లల్లో స్కిల్స్ పెరిగేలా చేసింది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..

"ప్రత్యేకంగా మా అబ్బాయిని వారం మొత్తం రోజులో ఒ...