Hyderabad, ఫిబ్రవరి 6 -- Captain America A Brave New World Twist Revealed: సూపర్ హీరో సినిమాలకు పెట్టింది పేరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఎమ్‌సీయూ నుంచి వచ్చే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే, ఒక్కో సూపర్ హీరోతో ప్రేక్షకులను అలరిస్తోంటోంది మార్వెల్.

ఇప్పుడు మార్వెల్ నుంచి వస్తోన్న నయా సూపర్ హీరో మూవీ కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్. ఇదివరకు కెప్టెన్ అమెరికాగా స్టీవ్ రోజర్స్ పాత్రలో క్రిస్ ఇవాన్స్ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. మార్వెల్‌లో ఆ కెప్టెన్ అమెరికా రిటైర్ అయిపోయినట్లుగా చూపించిన విషయం తెలిసిందే. దాంతో కొత్త కెప్టెన్ అమెరికా ఎవరు అనేదానిపై అమితాసాక్తి నెలకొంది.

ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం న్యూ కెప్టెన్ అమెరికాగా ఫాల్కన్ పాత్ర ఉండనుంది. ఈ ఫాల్కన్ పాత్రలో సామ్ విల్సన్ మంచి పేరు తెచ్చుకున్న...