భారతదేశం, జనవరి 27 -- టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మార్గదర్శకాల తర్వాత టెలికాం ఆపరేటర్లు వాయిస్, ఎస్ఎంఎస్ కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. కొత్త ట్రాయ్ మార్గదర్శకాలు పెరుగుతున్న టెలికాం సేవల వ్యయాన్ని నిర్వహించడం, మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్ లేదా 5జీ డేటా సేవలను ఎంచుకోనప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే తాజాగా ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరలను తగ్గించాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..

రిలయన్స్ జియో ఇటీవల రూ.1958, రూ.458లకు కొత్త వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ (ఎస్ఎంఎస్) ప్లాన్లను ప్రకటించింది. తరువాత జియో తన ప్యాక్ ధరలను తగ్గించింది. కొన్ని మార్పులు చేసింది. ఈ ప్లాన్ల ధరలు రూ.1748, రూ.448కి తగ్గాయి. ధరలను తగ్గించినప్పటికీ, రిలయన్స్ తక్కువ రోజులు లేదా ...