భారతదేశం, ఏప్రిల్ 19 -- రియల్ మి మరోసారి స్మార్ట్ ఫోన్ లాంచ్ కు సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం రియల్ మి ఇప్పటికే ఆరు స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. తాజాగా మరో రెండింటిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో 70ఎక్స్ 5జీ తో పాటు, ఎంట్రీ లెవల్ రియల్ మి సీ65 5జీ స్మార్ట్ ఫోన్ లు ఏప్రిల్ 24న లాంచ్ కానున్నాయి.

రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) డిజైన్, కెమెరా ఫీచర్లను మీడియా ఇన్విటేషన్స్ ద్వారా రియల్ మీ అందించింది. రియల్ మి నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ తరహాలోనే ఈ రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ఉండబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో హాఫ్ మూన్ డిజైన్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఈ మోడల్ గతంలోని గ్రీన్ కలర్ తో పాటు పౌడర్ బ్లూ కలర్ లోనూ లభ్యం కానుంది. రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ 45 వాట్ ఛార్జింగ్ ను...