భారతదేశం, మార్చి 8 -- రియల్​మీ తన ఇండియా-ఎక్స్​క్లూజివ్ పీ సిరీస్​కి అదనంగా పీ3 అల్ట్రా స్మార్ట్​ఫోన్​ని త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించనప్పటికీ, కంపెనీ రాబోయే డివజ్​ని టీజ్ చేసింది. ఫలితంగా ఈ గ్యాడ్జెట్​పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రియల్​మీ పీ3 అల్ట్రా స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ పీ3 అల్ట్రా అనేది పీ సిరీస్​లో అత్యంత ప్రీమియం మోడల్​గా ఉండే అవకాశం ఉంది. "అల్ట్రా డిజైన్, అల్ట్రా పెర్ఫార్మెన్స్, అల్ట్రా కెమెరా," వంటి కీలక ఫీచర్లను కంపెనీ హైలైట్ చేసింది. ఇది స్టైల్, స్పీడ్, అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాల కలయికను అందిస్తుంది. డిజైన్ లేదా సాంకేతిక స్పెసిఫికేషన్లపై రియల్​మీ ఇంకా పూర్తి వివరాలను, ప్రత్యేకతలను పంచుకోలేదు. కానీ లాంచ్ తేదీ సమీపి...