భారతదేశం, మార్చి 5 -- Realme 14 Pro Plus: రియల్మీ తన రియల్మీ 14 ప్రో ప్లస్ లైనప్ ను భారతదేశంలో విస్తరించింది. కొత్తగా రియల్మీ 14 ప్రో ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో ప్లస్ లో 8 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ కాన్ఫిగరేషన్ల వేరియంట్లను జనవరిలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా 12 జీబీ + 512 వేరియంట్ స్టోరేజ్ ను ప్రవేశపెట్టింది. ఇది డేటా కోసం ఎక్కువ స్థలం అవసరమయ్యే వినియోగదారుల కోసం ఉద్దేశించినది.

కొత్త రియల్మీ 14 ప్రో ప్లస్ 512 జీబీ వేరియంట్ ధర రూ.37,999. రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ తో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ మొదటి సేల్ మార్చి 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్మీ ఇండియా వెబ్సైట్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో లభిస్తుంది. రియల్ మీ 14 ప్రో ప్లస్ లైనప్ లోని...