Hyderabad, ఫిబ్రవరి 28 -- ఇటీవలి కాలంలో ఫుడ్ సెలక్షన్ గురించి చాలా మందిలో అవగాహన పెరిగింది. పిల్లలకు నచ్చిన ఆహార పదార్థాలను కొనేందుకు, పెద్దల కోసం స్నాక్స్ కొనేందుకు సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు పొరబాటు చేస్తుంటాం. అదేంటంటే, ఏయే ఆహారపదార్థాలతో తయారుచేశారో, అవి మన ఆహార అలవాట్లకు సరిపడతాయో లేదోననే విషయాన్ని గమనించకుండా కొనుగోలు చేసేస్తుంటాం. కానీ, వాటిపై ఉండే లేబుల్ తో ఆ ఫుడ్ మీకు సరిపోయేదా..? కాదా? అనే విషయాన్ని త్వరగా అంచనా వేయొచ్చట. గ్లూటెన్-ఫ్రీ, సూపర్-రిచ్, పోషక-సమృద్ధి వంటి వివరాలను తెలుసుకోవచ్చట. ఆ ప్రొడక్టులపై ఉండే లేబుళ్లను బట్టి వాటి గురించి ఎలా తెలుసుకోవాలంటే..

ప్రతిసారీ ప్రొడక్టును కొనుగోలు చేసే ముందు, దాని తయారీకి వినియోగించే ఆహార పదార్థాల జాబితాను చదవాల్సి ఉంటుంది. వీటి తయారీకి చాలా తక్కువ పదార్థాలను వినియోగిస్తున్నారంటే అ...