Hyderabad, ఫిబ్రవరి 10 -- Re-release Movie: బాలీవుడ్ మూవీ సనమ్ తేరీ కసమ్ మూవీ రీరిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. హాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన క్రిస్టఫర్ నోలాన్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ రీరిలీజ్ లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించగా.. ఈ చిన్న సినిమా మాత్రం దూసుకెళ్తోంది. 2016లో తొలిసారి రిలీజైనప్పుడు లైఫ్ టైమ్ సాధించిన కలెక్షన్ల కంటే ఇప్పుడు తొలి వీకెండ్ లోనే 170 శాతం ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.

బాలీవుడ్ నటులు హర్షవర్దన్ రాణే, మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరీ కసమ్ మూవీ 2016లో తొలిసారి రిలీజైంది. ఇందులోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయినా.. మూవీ మాత్రం ఫ్లాపయింది. గత శుక్రవారం (ఫిబ్రవరి 7) రీరిలీజ్ చేశారు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.15.5 కోట్లు వసూలు చేసింది. ఇది తొలిసారి వసూలు చేసిన మొత్తం కంటే 170 శాతం ఎక్కువ కావడం విశేషం. రోజురోజుక...