భారతదేశం, ఏప్రిల్ 13 -- రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం సినిమా చాలా ముఖ్యమైనది. ఆయనకు ఈ చిత్రమే ఫస్ట్ భారీ బ్లాక్‍బస్టర్. ఈ సినిమాతో ప్రభాస్‍కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్షం చిత్రం 2004 జనవరిలో థియేటర్లలో విడుదలైంది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద అదిరే కలెక్షన్లను దక్కించుకుంది. అంత క్రేజ్ దక్కించుకున్న వర్షం సినిమా మళ్లీ ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది.

వర్షం సినిమా వచ్చే నెల మే 23వ తేదీన థియేటర్లో రీ-రిలీజ్ కానుంది. 4కే వెర్షన్‍లో వెండితెరపైకి వస్తోంది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ విషయంపై నేడు (ఏప్రిల్ 13) అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది మే 23న వర్షం రీ-రిలీజ్ కానుందంటూ పోస్టర్ రివీల్ అయింది.

వర్షం సినిమాలో ప్రభాస్ యాక్షన్, స్క్రీ...