Hyderabad, మార్చి 26 -- RC16 Title Launch: రామ్ చరణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. అతని పుట్టిన రోజున ఆర్సీ16 మేకర్స్ నుంచి ఏం అనౌన్స్‌మెంట్ వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు మొత్తానికి పండగలాంటి వార్త వస్తోంది. గురువారం (మార్చి 27) చరణ్ 40వ బర్త్ డే సందర్భంగా ఆర్సీ16 టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ఆర్సీ16. ఇందులో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గురువారం (మార్చ...