భారతదేశం, ఏప్రిల్ 9 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వరుసగా రెండోసారి రెపో రేటును తగ్గింది. దీనితో మీ ఇల్లు, కారు రుణం ఈఎంఐ ఇప్పుడు తగ్గుతుంది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది.

ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. FY26 మొదటి మనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీనితో రెపో రేటు ఇప్పుడు 6 శాతానికి తగ్గింది. దీంతో అన్ని రకాల రుణాలు చౌకగా మారుతాయని భావిస్తున్నారు. రుణగ్రహీతల ఈఎంఐ తగ్గుతుంది. చాలా మంది నిపుణులు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తుందని విశ్వసించారు. ఇప్పుడు...