భారతదేశం, ఫిబ్రవరి 2 -- 'బడ్జెట్​ 2025'లో రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించింది! ఇక ఇప్పుడు.. అందరి దృష్టి రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ)పై పడింది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే విధంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ కట్​ చేస్తుందని సర్వత్రా అంచనాలు మొదలయ్యాయి.

2025 తొలి ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరగనుంది. 7న జరిగే మీడియా సమావేశంలో వడ్డీ రేట్లు/ రెపో రేట్లపై కీలక వివరాలను గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా ప్రకటిస్తారు.

అయితే, ఈసారి రెట్​ కట్స్​ కచ్చితంగా ఉంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మారుతున్న ధోరణులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఫిబ్రవరి 7న 25 బేసిస్ పాయింట్ల రేట్ల ...