భారతదేశం, ఫిబ్రవరి 7 -- అంచనాలకు తగ్గట్టుగానే, రెపో రేటును 25 బేసిస్​ పాయింట్ల తగ్గిస్తున్నట్టు ఆర్​బీఐ శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా ఇంతకాలం 6.5శాతంగా ఉన్న వడ్డీ రేట్లు, ఇప్పుడు 6.25శాతానికి తగ్గాయి. మరి ఆర్​బీఐ తాజా నిర్ణయంతో పర్సనల్​ లోన్​ల వడ్డీ రేట్లపై ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజలకు ఉపశమనం దక్కినట్టేనా? ఇక్కడ తెలుసుకోండి..

వాణిజ్య బ్యాంకులకు ఆర్​బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి పూచీకత్తుపై వాణిజ్య బ్యాంకులకు ఆర్​బీఐ రుణాలు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వివిధ ఆర్థిక సూచికలను అంచనా వేయడం ద్వారా రెపో రేటును నిర్ణయిస్తుంది. ఎంపీసీలో ఆర్​బీఐ గవర్నర్ సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. మానిటరీ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా రెపో రేటులో ఎంపీసీ మార్పులు చేస్తుంది.

11నెలల పాటు యథాతథంగ...