భారతదేశం, డిసెంబర్ 5 -- భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 5.5% నుంచి 5.25%కి తీసుకువచ్చింది. ఈ తాజా రేటు కోతతో 2025లో ఇప్పటివరకు రెపో రేటు తగ్గింపు మొత్తం 125 బేసిస్ పాయింట్లు అయ్యింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను అడ్జెస్ట్​ చేయడం ప్రారంభిస్తే, ఈఎంఐ భారం తగ్గుతుందని గృహ కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

ఆర్థిక పరిస్థితులను సమీక్షించడానికి, ద్రవ్య విధాన చర్యపై ఓటు వేయడానికి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో సమావేశమైంది. ద్రవ్యోల్బణం ట్రెండ్స్​, వృద్ధి అంచనాలు, ద్రవ్య లభ్యత అవసరాలను అంచనా వేసిన తర్వాత, రేట్ల కోతకు కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

"డిసెంబర్ 3, 4, 5 తేదీ...