Hyderabad, ఏప్రిల్ 27 -- Raw Onions: ప్రతి వంటగదిలో ఉల్లిపాయలు ఉండాల్సిందే. భారతీయ వంటకాలలో ఉల్లిపాయలది ప్రముఖ పాత్ర. కూరల్లో, పప్పుల్లో, బిర్యానీల్లో వేసిన ఉల్లిపాయల కన్నా ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలామంది తినడం మానేస్తారు. ఈ పచ్చి ఉల్లిపాయ తిన్నాక నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఆ వాసన పోతుంది. పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.

పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియను పెంచుతుంది. పేగు కదలికలకు సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు, గుండె జబ...