Hyderabad, ఫిబ్రవరి 4 -- ఏ వాతావరణంలోనైనా, చర్మానికి సంరక్షణ చాలా అవసరం. మీ చర్మాన్ని యథావిధిగా అలా ఉంచేస్తే, కాలుష్యం పెరిగిన వాతావరణంలో తిరగడం కారణంగా మీకు ముందుగానే వృద్ధాప్యం వచ్చేయొచ్చు. ఇందుకోసం చర్మాన్ని కాపాడుకోవాలంటే ఏమైనా క్రీములో, లేదా సహజమైన పదార్థాలను వాడుతుండాలి. మీకు మార్కెట్లో దొరికే కెమికల్స్‌తో కూడిన క్రీములు వాడటం ఇష్టం లేకపోతే ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలను ఉపయోగించి చర్మానికి సంరక్షణ కల్పించుకోవచ్చు. స్వచ్ఛమైన పచ్చిపాలతో చేసుకునే ఫేస్ ప్యాక్ అయితే ఇంకా బెటర్.

పచ్చి పాలు చర్మానికి చాలా మంచివి. దీనితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఎండిపోయినట్లుగా ఉండి, నిర్జీవంగా కనిపిస్తున్న చర్మం గలవారికి ఇది చాలా మంచిది, ఎందుకంటే పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మెరిసే చర్మం కావాలనుకుంటే, ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుక...