తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 8 -- రేషన్ కార్డుల జారీలో మీసేవా దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

"ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కుల గణనలో వివరాలు తీసుకున్నారు. గ్రామసభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా..?" అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని హరీశ్ రావు నిలదీశారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నా...