భారతదేశం, ఫిబ్రవరి 7 -- Ratan Tata will: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వీలునామాను ఇటీవల బహిరంగ పర్చారు. అందులో తన కుటుంబానికి చెందని ఒక వ్యక్తికి రూ. 500 కోట్ల సంపద అందించాలని ఉంది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. సోషల్ మీడియాలో కూడా ఆ వ్యక్తి గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున వెతకడం ప్రారంభించారు.

రతన్ టాటా తన వీలునామాలో రూ. 500 కోట్లకు వారసుడిగా ప్రకటించింది మోహిని మోహన్ దత్తా (Mohini Mohan Datta) అనే వ్యక్తికి. మోహిని మోహన్ దత్తాది జంషెడ్ పూర్. అతడు కొన్ని దశాబ్దాలుగా రతన్ టాటాకు సన్నిహితుడు. మోహిని మోహన్ దత్తా స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీకి సహ యజమానిగా ఉన్నారు. ఇది తరువాత టాటా యాజమాన్యంలోని తాజ్ సర్వీసెస్ విభాగ...